కమలినీ ముఖర్జీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. గ్లామర్ రోల్స్ కు దూరంగా, నటనకు ప్రాధాన్యమున్న పాత్రలు చేస్తూ అలరించింది ఈ బెంగాలీ ముద్దుగుమ్మ. రాజా హీరోగా వచ్చిన 'ఆనంద్' సినిమాతో ఊహించని పాపులారిటీ సొంతం చేసుకున్న ఈ చిన్నది.. గోదావరి,గమ్యం, స్టైల్, గోపి గోపిక గోదావరి ఇలా పలు చిత్రాల్లో హీరోయిన్ గా నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది.. చివరిగా రామ్ చరణ్ హీరోగా నటించిన 'గోవిందుడు అందరివాడేలే' మూవీ తర్వాత తెలుగు ఇండస్ట్రీకి దూరమయిం ది. ఆ తర్వాత ఇతర భాషల్లో రెండు సినిమాలు చేసి.. 2016లో మలయాళం మూవీ 'పులి మురుగన్ ' తర్వాత పెళ్లి చేసుకుని సినీ పరిశ్రమకు మొత్తానికే దూరమైంది. ప్రస్తుతం పర్సనల్ఫన్ ను లీడ్చేస్తున్న ఈ బ్యూటీ.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేసింది. 'సినిమాల్లో ఎన్నో జరుగుతూ ఉంటాయి. దర్శకుడు ఒక సీన్ చేయమంటారు. తీరా అది అవసరం లేదనో లేక బాగోలేదనో మళ్లీ దానిని ఎడిటింగ్ లో తీసేస్తుంటారు. ఆ విషయం నటీనటులకు చెప్పరు. ఒక మాట కూడా మనతో చెప్పకుండా మన సీన్ లేదా డైలాగులు తీసేస్తే ఆ బాధ ఎలా ఉంటుందో అనుభవించే వాళ్లకే తె లుస్తుంది. దాన్ని నేను లైట్ తీసుకోలే కపోయాను. నేను తెలుగులో ఎన్నో రకాల ఎమోషన్స్ తో కూడిన పాత్రల్లో నటించాను. బలమైన స్త్రీ పాత్రలు కూడా చేశాను. అదే టైంలో సున్నితమైన అమ్మా యిగా కూడా కనిపించాను. అన్ని పాత్రలు చేసిన నాకు టాలీవుడ్ లో బలమైన క్యారెక్టర్లు రావడం తగ్గిపోయా యి. చివరిగా గోవిందుడు అందరివాడేలే సినిమాలో నాకు సరైన ప్రాముఖ్యత లభించలేదు అనిపించింది. మూవీ పూర్తయ్యాక నా పాత్ర చూసుకొని నాకే ఇబ్బందిగా అనిపించింది. బాధపడ్డాను.. గోడవపడాలని, రచ్చ చేయాలని అనుకోలేదు. అందుకే ఆ తర్వాత తెలుగు సినిమాలు చేయకూడదని నిర్ణయించుకొని ఇక టాలీవుడ్ కి దూరం అయ్యాను అంటూ కమలినీ చెప్పుకొచ్చింది.