బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ రాముడిగా, హీరోయిన్ సాయి పల్లవి సీతగా డైరెక్టర్ నితేష్ తివారీ తెరకెక్కిస్తున్న మూవీ రామాయణ్. రావణుడిగా కన్నడ హీరో యష్ యాక్ట్ చేస్తున్నారు. కాగా ఈ సినిమా తాజాగా ముంబైలో ఓ కీలక షెడ్యూల్ పూర్తి చేసుకున్నట్లు తెలిసింది. దీనిలో భాగంగా యష్, రణబీర్ కపూర్ లపై కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను షూట్ చేశారు. ఇక, తదుపరి షెడ్యూల్ వచ్చే వారం నుంచి ముంబైలోనే స్టార్ట్ చేయనున్నారు. ఆ షెడ్యూల్లో యష్ తో పాటు ప్రధాన తారాగణంపై యుద్ధ నేపథ్య సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. టాలెంటెడ్ దర్శకుడు నితేష్ తివారీ తెరకెక్కిస్తున్న ఈ మూవీ రెండు భాగాలుగా రానుంది. ఫస్ట్ పార్ట్ 2026 దీపావళికి గ్రాండ్ గా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అలాగే రెండో భాగం 2027 దీపావళి సందర్భంగా థియేటర్లలో విడుదల అవుతుందని తెలుస్తుంది. ఈ చిత్రంలో సన్నీ డియోల్, రకుల్, లారా దత్తా వంటి ప్రముఖ నటీనటులు కూడా భాగం కాబోతున్నారు. ఈ సినిమాపై పాన్ ఇండియా వైడ్ గా భారీ అంచనాలు ఉన్నాయి. పవిత్ర ఇతిహాసం రామాయణం ఆధారంగా రాబోతున్న ఈ మూవీపై అన్ని వర్గాల్లోనూ ఆసక్తి ఉంది.