Jagapathi Babu : ఫ్యామిలీ హీరో జగపతి బాబు కెరీర్ ఎలా టర్న్ అయిందో తెలుసా?

Update: 2024-03-18 07:47 GMT

ఫ్యామిలీ హీరో, యాక్షన్ హీరో.. ఇప్పుడు లేటెస్ట్ గా విలన్.. ఇదీ టాలెంటెడ్ నటుడు జగపతి బాబు (Jagapathi Babu) గురించి చెప్పే సింపుల్ మాట. గాయం సినిమాతో జగపతిబాబు కెరీర్ ను మలుపుతిప్పిన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. అంతఃపురం సినిమాతో కృష్ణవంశీ కూడా ఓ డిఫరెంట్ టచ్ ఇచ్చారాయనకు. లెజెండ్ తో మరోసారి ఆయన కెరీర్ ను తిప్పిన డైరెక్టర్ బోయపాటి శ్రీను. అలా.. సినిమా ఇండస్ట్రీలో మలుపులు తిరిగిన జగపతిబాబు కెరీర్.. మొదట ఎక్కడ టర్న్ అయిందో తెలుసుకోండి.

ప్రతి పది తెలుగు సినిమాలలో కనీసం రెండు మూడు సినిమాలలో జగపతి బాబు తప్పకుండా నటిస్తున్నారు. ఒకవైపు పాజిటివ్ పాత్రలు చేస్తూనే మరొకవైపు విలన్ గా నెగటివ్ పాత్రలు కూడా చేస్తూ అల్లరిస్తున్నారు. ఈ మధ్య కాలంలో జగపతిబాబు ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు అభిమానులతో ముచ్చటిస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే ట్విట్టర్ అండ్ ఇన్‌స్టాగ్రామ్ లో జగ్గూభాయ్ వేసే పోస్టులకు నెటిజెన్స్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తాజాగా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశారు జగపతిబాబు. పోలీస్ గెటప్ లో ఉన్న ఫోటోని షేర్ చేస్తూ.. నేను సినిమాల్లోకి రాకపోయి ఉంటే కచ్చితంగా సూపర్ కాప్ అయ్యి ఉండేవాడిని అన్నారు.

పోలీస్ జాబ్ గురించి తనకున్న అభిప్రాయాలను షేర్ చేసుకున్నారు జగపతిబాబు. ఇప్పుడున్న సూపర్ కాప్స్ లాగా నేను లా అండ్ ఆర్డర్ ని గడగడలాడించేవాడిని. ఏం అంటారు అంటూ రాసుకొచ్చారు జగపతి బాబు. దీనిపై తమకు తోచినట్టుగా స్పందిస్తున్నారు ఆయన ఫ్యాన్స్.

Tags:    

Similar News