బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఐక్యత లోపించిందని నటుడు అక్షయ్ కుమార్ ఓ ఇంటర్వ్యూలో అభిప్రాయపడ్డారు. ‘నాకే అవకాశం దక్కితే పరిశ్రమలో ఐక్యత తీసుకురావడమే మొదటి లక్ష్యంగా పెట్టుకుంటా. ఒకరి విజయాన్ని మరొకరు సెలబ్రేట్ చేసుకునేలా అందరూ కలిసి పనిచేయాలి. సమస్యలకు ఉమ్మడిగా పరిష్కారాన్ని కనుగొనాలి. అందరూ కలిసికట్టుగా ముందుకు సాగితే ఇతర పరిశ్రమలపైనా అది సానుకూల ప్రభావాన్ని చూపిస్తుంది’ అని వ్యాఖ్యానించారు.
ఇదేతరహా అభిప్రాయాన్ని ఇటీవల అజయ్‌దేవ్‌గణ్ సైతం తెలిపారు. ఇండస్ట్రీలో యూనిటీ తగ్గిందని ఆయన చెప్పారు. ‘‘దక్షిణాదిలో ఏదైనా సినిమా విడుదలైతే నటీనటులంతా ఒకేతాటిపైకి వచ్చి దాన్ని ప్రమోట్ చేస్తారు. అది నాకెంతో నచ్చింది. నిజంగా అది మెచ్చుకోవాల్సిన విషయం. హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆ ఐక్యతే కొరవడింది. ఇండస్ట్రీలో ఐక్యత ఉండాలని నేను ఎప్పుడూ కోరుకుంటా’’ అని ఇటీవల ఓ ప్రెస్‌మీట్‌లో అజయ్ చెప్పారు.