టైటానిక్ లార్డ్ ఆఫ్ ది రింగ్స్ ఫేమ్ నటుడు బెర్నాల్డ్ హిల్ తుదిశ్వాస విడిచారు. వృద్ధ్యాప్య సమస్యల కారణంగా ఆయన మరణించినట్లు తెలిసింది. ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు అధికారికంగా ప్రకటించినట్లు ఇంగ్లీష్ మీడియాల్లో కథనాలు వస్తున్నాయి.
ఆయన అభిమానులు, ఇతర సెలబ్రిటీలు సంతాపం తెలుపుతున్నారు. బెర్నార్డ్ హిల్ తన కెరీర్లో చాలా సినిమాలు, సిరీస్లలో పనిచేశాడు. నటుడు 1976లో ట్రయల్ బై కాంబాట్ చిత్రంతో తన కెరీర్ ను ప్రారంభించాడు.
దీని తరువాత అతను గాంధీ, ది బౌంటీ, ది చైన్, మౌంటైన్స్ ఆఫ్ ది మూన్, టైటానిక్, ది స్కార్పియన్ కింగ్, లార్డ్ ఆఫ్ ది రింగ్స్, నార్త్ వర్సెస్ సౌత్ వంటి చిత్రాలలో పనిచేశాడు.