విక్టరీ వెంకటేశ్ ( Venkatesh ), అనిల్ రావిపూడి ( Anil Ravipudi ) కాంబోలో రాబోతున్న సినిమాలో ఐశ్వర్య రాజేశ్ ( Aishwarya Rajesh ), మీనాక్షి చౌదరి ( Meenakshi Chaudary ) హీరోయిన్లుగా నటించనున్నారు. ఈ విషయాన్ని మూవీ టీమ్ తాజాగా ప్రకటించింది. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ మూవీ పూజా కార్యక్రమం ఇవ్వాళ జరగనుంది. త్వరలోనే ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ కానున్నట్లు సమాచారం. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. వెంకీ మామ, డైరెక్టర్ అనిల్ కలిసి ఇప్పటికే ఎఫ్-2, ఎఫ్-3 సినిమాలు చేసిన సంగతి తెలిసిందే.
ఇదిలా ఉంటే.. కోలీవుడ్ ఇండస్ట్రీలో వరసు చిత్రాలతో అలరిస్తుంది ఐశ్వర్య రాజేశ్. ముఖ్యంగా లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తుంది. కేవలం గ్లామర్ రోల్స్, హీరోయిన్ గా కాకుండా కంటెంట్ ప్రాధాన్యతను బట్టి వైవిధ్యమైన సినిమాలు చేసేందుకు రెడీ అవుతుంది. తెలుగులో విజయ్ దేవరకొండ సరసన నటించిన వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలో కనిపించింది.
చాలా కాలం తర్వాత తెలుగులో మంచి ఆఫర్ అందుకుంది. వెంకీ అనిల్ రావిపూడి సినిమాను రేపు పూజా కార్యక్రమాలతో స్టార్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇన్నాళ్లు కామెడీ, యాక్షన్ చిత్రాలతో అలరించిన డైరెక్టర్ అనిల్ రావిపూడి ఇప్పుడు డిఫరెంట్ జోనర్ తో ప్రేక్షకులను అలరించేందుకు రానున్నట్లు తెలుస్తోంది.