'కల్కి 2' మూవీ నుంచి దీపిక ఔట్ .. ఇప్పుడీ వార్త ఇండస్ట్రీ మొత్తం హాట్ టాపిక్ గా మారింది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా దీపికా పదుకొణె గురించిన పోస్టులే కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కల్కి 2898 ఏడీలో కృష్ణుడి ఎంట్రీ సీన్ ను దర్శకుడు నాగ్ అశ్విన్ షేర్ చేశాడు. అందులో కర్మను ఎవరూ తప్పించుకోలేరు.. నీ కర్మను నువ్వు అనుభవించాల్సిందే.. అని అశ్వత్థామకు కృష్ణుడు చెప్పే డైలాగ్ ఉంది. దీన్ని పోస్ట్ చేసిన ఆయన.. జరిగిన దాన్ని ఎవరూ మార్చలేరు.. కానీ, తర్వాత ఏం జరగాలో మీరు ఎంచుకోవచ్చు అని క్యాప్షన్ ఇచ్చాడు. ప్రస్తుతం ఆయన షేర్ చేసిన పోస్ట్.. దానికి పెట్టిన క్యాప్షన్ చర్చనీయాంశంగా మారాయి. ఇది దీపికను ఉద్దేశించే పోస్ట్ పెట్టాడనేది నెటిజన్ల అభిప్రాయం. దీపిక ఈ ప్రాజెక్టులో భాగం కాకపోవడంపై రకరకాల కామెంట్స్ విని పిస్తున్నాయి. దీనిపై సోషల్ మీడియాలో ఓ చిన్న యుద్ధమే జరుగుతోంది. దీపికను సపోర్ట్ చేస్తూ ఆమె అభిమానులు పోస్ట్లు పెడుతుండగా, ప్రభాస్ అభిమానులు వారిని విమర్శిస్తూ రిప్లైలు ఇస్తున్నారు. దీనిపై దీపిక స్పందించాల్సి ఉంది.