Youtuber Gayathri Death: కారు ప్రమాదంలో యూట్యూబర్ మృతి.. కేసులో ఎన్నో ట్విస్టులు..!
Youtuber Gayathri Death: గచ్చిబౌలిలో నిన్న సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదం రెండు నిండు ప్రాణాల్ని బలితీసుకుంది.;
Youtuber Gayathri Death: గచ్చిబౌలిలో నిన్న సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదం రెండు నిండు ప్రాణాల్ని బలితీసుకుంది. అతివేగానికి మద్యం మత్తు కూడా తోడవడంతో కారును కంట్రోల్ చేయలేక యాక్సిడెంట్ చేశాడు రోహిత్. ప్రస్తుతం అతను కూడా చావుబతుకుల మధ్య కొన ఊపిరితో AIGలో చికిత్స పొందుతున్నాడు. అటు, చనిపోయిన ఇద్దరి మృతదేహాలు ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యులు వచ్చాక పోస్ట్‌మార్టం ప్రక్రియ పూర్తి చేసి వారికి అప్పగిస్తారు.
యాక్సిడెంట్‌లో చనిపోయిన వారిలో ఒకరు మహేశ్వరి కాగా, మరొకరు కారులో ఉన్న గాయత్రి. తన కెరీర్‌పై ఎన్నో ఆశలు పెట్టుకుంది గాయత్రి. సినిమాల్లో మంచి అవకాశాల కోసం ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం జూనియర్ ఆర్టిస్టుగా చేస్తున్నా భవిష్యత్‌పై నమ్మకంతో ఉంది. నెల్లూరు జిల్లా నుంచి హైదరాబాద్‌కి వచ్చి నిజాంపేటలో ఉంటూ ఇండస్ట్రీలో స్థిరపడేందుకు ప్రయత్నిస్తోంది.
కూకట్‌పల్లి HMT హిల్స్‌కి చెందిన యువకుడు రోహిత్‌తో స్నేహం కారణంగా అతను పిలిస్తే నిన్న హోలీ వేడుకల్లో పాల్గొనేందుకు వెళ్లింది. ప్రిజం పబ్‌లో హోలీ ఈవెంట్ తర్వాత తిరిగి వస్తుండగా యాక్సిడెంట్‌లో ప్రాణాలు కోల్పోయింది. టిక్‌టాక్‌లో గాయత్రికి మంచి ఫాలోయింగ్ ఉంది. ఆమె చనిపోవడం ఇప్పుడు విషాదాన్ని నింపింది.
ఇక ప్రమాదంలో చనిపోయిన మరో మహిళ మహేశ్వరి. గచ్చిబౌలిలోని ప్రమాదం జరిగిన స్పాట్ ఎల్లా హోటల్ వద్ద ఆమె గార్డెనింగ్ చేస్తోంది. ఆ సమయంలో వేగంగా దూసుకొచ్చిన కారు ఢీకొట్టడంతో స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయింది. కాసేపట్లో ఇంటికి బయలుదేరుతుంది అనగా ఈ ప్రమాదం జరగడంతో విషాదం నెలకొంది. నిన్న డ్రై డే. హోలీ సందర్భంగా నగరంలో మద్యం షాపులన్నీ క్లోజ్. ఐనా వీళ్లు పార్టీ చేసుకుని ఫుల్ జోష్‌లో గాల్లో తేలుతూ షికారు చేస్తున్నారు.
ఐతే.. అప్పటికే తాగిన కిక్కు తలకు ఎక్కడం, ఓవర్ స్పీడ్ కారణంగా రోహిత్ డ్రైవ్ చేస్తున్న కారు డివైడర్‌ను ఢీకొట్టి పల్టీకొట్టింది. యాక్సిడెంట్ దెబ్బకు ఏకంగా రెండు కారు టైర్లు విరిగిపడ్డాయి. ముందు భాగమంతా తుక్కుతుక్కైపోయింది. మద్యం మత్తు, అతివేగం ప్రాణాలు తీస్తున్న ఘటనలు తరచుగా జరుగుతూనే ఉన్నా యువతలో మార్పు రాకపోవడం ఆందోళన కలిగిస్తోంది.