రంగబలి సినిమాతో 2023లో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన భామ యుక్తి తరేజా. ఢిల్లీ టైమ్స్ ఫ్రెష్ ఫేస్ పోటీలో గెలుపొందిన ఈ హర్యానా భామ. 2019లో ఎంటీవీ సూపర్ మోడల్ ఆఫ్ ది ఇయర్ లో సెమీఫైనల్ వరకు వెళ్లింది. ఇమ్రాన్ హష్మీతో కలిసి "లుట్ గయే" వంటి మ్యూజిక్ వీడియోలలో కనిపించింది. 2023లో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ నాగ శౌర్యతో "రంగబలి" సినిమాలో నటించింది. పవన్ బాసం శెట్టి నిర్మించిన ఈ సినిమాలో షైన్ టామ్ చాకో, మురళి శర్మ తదితరులు నటించారు. 2024లో, ఆమె హనీఫ్ అదేని దర్శకత్వం వహించిన మలయాళ చిత్రం "మార్కో"లో కనిపించింది, ఇందులో ఉన్ని ముకుందన్ ప్రధాన పాత్రలో నటించారు. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే యుక్తి.. ఇన్ స్టాలో తన ఫొటోలను పోస్ట్ చేసింది. సహజంగానే ఫ్యాషన్ పట్ల మక్కువ ఉన్న యుక్తి అభిమానులను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తూనే ఉంటుంది. ఇందులో భాగంగా ఆమె పోస్ట్ చేసిన ఫొటోలు అభిమానులను ఆకర్షిస్తున్నాయి.