Uppal : తండ్రి కాదు కామాంధుడు.. కొడుకుపైనే ..!
Uppal : ఓ తండ్రి చేయాల్సిన పనే కాదు. కన్న కొడుకుపైనే అంతటి అఘాయిత్యం చేస్తాడని ఎవరూ ఊహించరు. సభ్య సమాజం తలదించుకునే ఘటన ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది;
Uppal : ఓ తండ్రి చేయాల్సిన పనే కాదు. కన్న కొడుకుపైనే అంతటి అఘాయిత్యం చేస్తాడని ఎవరూ ఊహించరు. సభ్య సమాజం తలదించుకునే ఘటన ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. నిందితుడు భరత్‌రెడ్డి తన కొడుకుపైనే కామవాంఛ తీర్చుకున్నాడు. నాలుగేళ్ల పిల్లాడు తండ్రి పెడుతున్న టార్చర్‌ను భరించలేక.. ఎలా చెప్పాలో అర్థంకాక చిత్రహింస అనుభవించాడు. తండ్రి చేస్తున్న అకృత్యాలు తల్లికి వివరించే సరికి.. ఆమె షాక్ అయింది.
భరత్‌రెడ్డి అరాచకాలను భరించలేకపోయిన వీణారెడ్డి ఉప్పల్ ఉమెన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కొడుకుపైనే తండ్రి లైంగిక దాడి చేస్తున్నాడని, తనను తన బిడ్డను కామాంధుని నుంచి రక్షించాలని వేడుకుంది. రంగంలోకి దిగిన మహిళా పోలీసులు పిల్లాడిని విచారించారు. అసలేం జరిగిందో కనుక్కున్నారు. తండ్రి ఏమేం పనులు చేస్తున్నాడో వివరించడంతో అంతా షాక్ అయ్యారు.
భరత్‌రెడ్డితో భేదాభిప్రాయాల కారణంగా వీణ రెడ్డి విడాకులు తీసుకున్నారు. పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకుని విడివిడిగా ఉంటున్నారు. తీర్పు ప్రకారం బాబును కొన్ని రోజులు భరత్‌రెడ్డి దగ్గర ఉంచాలి. ఆ సమయంలోనే కన్న కొడుకుపై కామవాంఛ తీర్చుకుంటూ, రాక్షసానందం పొందాడు భరత్ రెడ్డి. ఆ నొప్పి భరించలేక తల్లి వద్దకు వచ్చినప్పుడు ఏడ్చిన సందర్భాలెన్నో ఉన్నాయంటున్నారు కుటుంబ సభ్యులు.
భరత్‌రెడ్డి ఒక హోమో సెక్యువల్ అని, తన బిడ్డను నానావిధాలుగా టార్చర్ పెట్టాడని వీణా రెడ్డి ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించి డాక్టర్ రిపోర్ట్‌ను సైతం పోలీసులకు అందించారు వీణారెడ్డి.