TG : ఏసీబీ వలలో శామీర్ పేట ఎస్పై.. రెడ్ హ్యాండెడ్ గా అరెస్ట్

Update: 2025-04-29 10:15 GMT

శామీర్ పేట పోలీసు స్టేషన్ పై ఏసీబీ అధికారులు దాడిచేశారు. రూ.22 వేలు లంచంగా తీసుకుంటున్న ఎస్ఐ పరశు రామ్ ను పట్టుకున్నామని ఏసీబీ డీఎస్పీ శ్రీధర్ తెలిపారు. ఒక బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సోమవారం దాడులు చేసినట్లు ఆయన తెలిపారు. ఏసీబీ డీఎస్పీ శ్రీధర్ కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. అక్రమంగా ఆయిల్ తరలిస్తున్నారంటూ బాధితుడిని, వారి స్నేహితులను అదుపులోకి తీసుకుని శామీర్పేట్ పోలీసులు ఇంటరాగేషన్ చేశారు. బాధితునిపై కేసు నమోదు చేస్తామని బెదిరించారని, కేసు నమోదు చేయకూడదు అంటే రెండు లక్షల రూపాయలు ఇవ్వాలని ఎస్ఐ డిమాండ్ చేశారని బాధితులు తెలిపారు.

ఆ మేరకు రెండు లక్షల రూపాయలను ఎస్ఐకి ఇచ్చారన్నారు. అదనంగా రూ.20 వేలు ఇవ్వాలని, కానిస్టేబుల్స్ కోసం రెండు వేలు ఇవ్వాలని డిమాండ్ చేయడంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. దీంతో ఏసీబీ అధికారుల సూచన మేరకు సోమవారం పోలిస్టేషన్లో ఎస్సై చాంబర్కు వెళ్లిన బాధితుడు డబ్బులు ఇవ్వ బోయాడు. ఎస్ఐ పరశురామ్ సూచన మేరకు టేబుల్ కింది ఉన్న డస్ట్ బిన్ లో డబ్బులు వేసి వెళ్లమని చెప్పగా బాధితుడు అట్లే చేశాడు. అప్పటికే పోలిస్టేషన్ వద్ద మాటు వేసి ఉన్న ఏసీబీ అధికారులు దాడి చేసి ఎస్ఐని పట్టుకున్నారు. ఇందులో ఇంకా ఎవరెవరి పాత్ర ఉందనే విషయాన్ని దర్యాప్తు చేస్తున్నామన్నారు.

Tags:    

Similar News