బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్ల కేసులో టాలీవుడ్ సెలబ్రిటీల విచారణ కొనసాగుతోంది. ఇవాళ యాంకర్ శ్యామల పంజాగుట్ట పోలీసుల ఎదుట హాజరుకానున్నారు. తనపై నమోదైన FIRను కొట్టివేయాలని ఆమె హైకోర్టును ఆశ్రయించగా శ్యామలను అరెస్ట్ చేయొద్దని పోలీసులను న్యాయస్థానం ఆదేశించింది. అయితే విచారణకు సహకరించాలని ఆమెకు సూచించింది. అటు ఇప్పటికే విష్ణుప్రియ, రీతూ చౌదరిని విచారించిన పోలీసులు రేపు మరోసారి ఎంక్వైరీ చేయనున్నారు.
మరోవైపు బెట్టింగ్‌లకు పాల్పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని యువతకు ఏపీ డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా సూచించారు. ఐపీఎల్ బెట్టింగ్ కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా పెట్టామని తెలిపారు. బెట్టింగ్ నిర్వహించినా, పాల్పడినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రాఫిట్స్ వస్తాయని నమ్మి బెట్టింగ్ మాఫియా వలలో పడకుండా జాగ్రత్తగా ఉండాలని, బెట్టింగ్ ముఠాల చేతిలో మోసపోయిన వారు ఫిర్యాదు చేస్తే నిందితులపై కేసు నమోదు చేస్తామన్నారు.