భూకంపం, వరదల ప్రభావంతో బ్రెజిల్ అతలాకుతలం అవుతోంది. దాదాపు 130 మంది చనిపోయారు. ప్రస్తుతానికి 150మంది గల్లంతయ్యారు. వెయ్యిమంది గాయపడినట్లు చెబుతున్నారు. 20 లక్షల మంది ప్రజలు వరదలతో ఇబ్బందిపడుతున్నారు.
బ్రెజిల్‌లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా చాలా చోట్ల రోడ్లు కొట్టుకుపోయాయి. ఉత్తర అమెరికా దేశం బ్రెజిల్‌లో భారీ వర్షాల తర్వాత సంభవించిన వరద బీభత్సం సృష్టించింది. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. అనేక నగరాలు వరద నీటితో మునిగిపోయాయి. కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ వరదల్లో పదుల సంఖ్యలో గల్లంతైనట్లు సమాచారం.
బ్రెజిల్ లోని పలు రాష్ట్రాల్లో నీటి సరఫరా ఇప్పటికీ చాలా తక్కువగా ఉంది. క్యాంపులు, ఆసుపత్రులకు ట్యాంకర్లను సరఫరా చేస్తున్నారు. నీళ్లు నిలిచిన పలుచోట్ల బోట్ల సహాయంతో ప్రజలకు ఆహారాన్ని అందజేస్తున్నారు. దీంతో.. బ్రెజిల్ ఆర్థిక వ్యవస్థ కూడా దెబ్బతిన్నట్టు రిపోర్టులు అందుతున్నాయి.