Narsinghi DI transferred : లావణ్యతో కాల్స్ లీక్.. నార్సింగి డీఐపై బదిలీ వేటు
హీరో రాజ్ తరుణ్, లావణ్య కేసులో నార్సింగి పోలీస్ స్టేషన్లో డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్న శ్రీనివాస్ పై బదిలీ వేటు పడింది. ఆయనపై పలు ఆరోపణలు రావడంతో ఐజీ కార్యాలయానికి అటాచ్ చేశారు. కేసు విచారణ సమయంలో లావణ్య ఇంటికి వెళ్లిన శ్రీనివాస్ ఆమెతో కుమ్మక్కై కేసును తప్పుదోవ పట్టించినట్లు ప్రాథమిక సమాచారం అందడంతో ఉన్నతాధికారులు యాక్షన్ తీసుకున్నారు. ఈ ఘటనపై పోలీసు ఉన్నతాధికారులు అంతర్గత విచారణకు ఆదేశాలు జారీ చేశారు. నార్సింగ్ డిఐ శ్రీనివాస్ లావణ్యతో తరచూ వాట్సాప్ లో వీడియో, ఆడియో కాల్స్ మాట్లాడుతూ పరిచయం పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలో ఆ ఇద్దరి ఆడియో కాల్స్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీస్ ఉన్నతాధికారులు దృష్టిసారించారు. ఈ క్రమంలో విచారణలో డిఐ శ్రీనివాస్ లావణ్యతో మాట్లాడింది నిజమే అని తేలడంతో అతనిని ఐజి ఆఫీసుకు అటాచ్ చేస్తూ చర్యలు తీసుకున్నారు.