Chinese Scientist : యూఎస్ చైనా శాస్త్రవేత్త అరెస్ట్

Update: 2025-06-05 07:00 GMT

యూఎస్ ఓ చైనా శాస్త్ర వేత్తను పోలీసులు అరెస్ట్ చేశారు. పంటకు సంక్రమించే ప్రమాదకరమైన శిలీంద్రాన్ని యూఎస్లోకి అక్రమంగా రవాణా చేసినందుకు మిచిగాన్ యూనివర్సిటీలో పరిశోధకుడిగా పనిచేస్తోన్న యుంకింగ్ జియాన్ ను అరెస్ట్ చేసినట్లు ఎఫ్బీఐ తెలిపింది. సోషల్ మీడియా ద్వారా ఆమె అరెస్టును ఎఫ్బీఐ డైరెక్టర్ కాష్ పటేల్ ధ్రువీకరించారు. ఆమె తీసుకొచ్చిన ఫంగస్ గోధుమ, మన్నజోన్న, వరి, బార్లీ పంటలను నాశనం చేస్తుందని, ఇది మనుషులు, పశువుల ఆరోగ్యానికి నష్టం చేస్తుందని తెలిపారు. గతంలో ఇదే యూనివర్సిటీలో పనిచేసి ప్రస్తుతం చైనా యూనివర్సిటిలో విధులు నిర్వహిస్తున్న ఆమె ప్రియుడు జున్యోంగ్ లియుపై కుట్ర, స్మగ్లింగ్, వీసా మోసం, తప్పుడు స్టేట్మెంట్ ఇవ్వడం లాంటి అభియోగాలు నమోదు చేశారు. చైనా నుంచి అక్రమంగా ఈ ఫంగస్కు ఎలాంటి అనుమతి లేదన్నారు.

Tags:    

Similar News