గుట్టుచప్పుడు కాకుండా కొకైన్ అమ్ముతున్న వ్యక్తిని కాచిగూడ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండుకు తరలించారు. వివరాల్లోకి వెళితే.. ముంబైకి చెందిన గాడ్విన్ ఐఫెనహీ నగరంలోని వివిధ కేసుల్లో నిందితునిగా ఉన్నాడు. కొంత కాలంగా కాచిగూడ రైల్వే స్టేషన్ పార్శిల్ కార్యాలయం సమీపంలో ఇద్దరు స్నేహితులతో కలిసి గాడ్విన్ దొంగచాటుగా కొకైన్ అమ్ముతున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది. ఈ మేరకు సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు కొకైను విక్రయిస్తున్న గాడ్విన్ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అనంతరం కాచిగూడ పోలీసులకు అప్పగించారు. నిందితుని నుంచి రూ. 42 వేల విలువ చేసే 7 గ్రాముల కొకైనన్ను స్వాధీనం చేసుకుని రిమాండుకు తరలించారు.