Cyberabad Police : చోరీ అయిన ఫోన్లు అప్పజెప్పిన సైబరాబాద్ పోలీసులు

Update: 2024-10-24 09:15 GMT

దొంగతనానికి గురైన 800 సెల్‌ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందజేశారు సైబరాబాద్ పోలీసులు. 2 కోట్ల రూపాయల విలువైన 800 ఫోన్లను రికవరీ చేశామని సైబరాబాద్‌ క్రైమ్‌ డీసీపీ నర్సింహా తెలిపారు. యాభై మంది పోలీసులు నెలన్నర రోజులు కష్టపడి ఈ ఫోన్లు రికవరీ చేశారన్నారు. గత ఆరు నెలలుగా రెండు వేల ఫోన్లు రికవరీ చేసి బాధితులకు అందజేశామని డీసీపీ తెలిపారు. ఫోన్ పోయిన వెంటనే సీఈఐఆర్ పోర్టల్ లో నమోదు చేసుకోవాలన్నారు. ఈ సందర్భంగా సెకండ్‌ హ్యండ్‌ మొబైల్‌ ఫోన్లు అమ్మినా, కొన్నా కేసులు నమోదు చేస్తామని.. సైబర్‌ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డీసీపీ నర్సింహా హెచ్చరించారు.

Tags:    

Similar News