మనవరాలి వయసున్న చిన్నారిపై క్రూరమృగంలా ప్రవర్తించాడు ఓ వృద్ధుడు. పెద్దపెల్లి జిల్లాలో మైనర్ బాలికపై జరిగిన అత్యాచారం ఘటన మరువకముందే మరో అమానుష ఘటనే జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణంలో ఆదివారం ఉదయం మరొకటి చోటు చేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాయికల్ పట్టణానికి చెందిన సింగు గంగ నర్సయ్య (60) అనే వృద్ధుడు, పట్టణానికి చెందిన ఏడవ తరగతి చదువుతున్న మైనర్ బాలికను తన టైలర్ షాప్ కు పిలుచుకొని, మాయమాటలు చెప్పి లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధితురాలు తన తల్లికి తెలియజేసింది. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు సింగు గంగనర్సయ్యపై కేసు నమోదు చేసినట్లు ఏఎస్ఐ దేవేందర్ నాయక్ తెలిపారు.
పోలీసులు నిందితుడ్ని అదుపులోకి తీసుకొని వైద్య పరీక్షల నిమిత్తం బాలికను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.