AP : మాజీ మంత్రి విశ్వరూప్ కుమారుడికి రిమాండ్

Update: 2024-10-23 09:00 GMT

ఏపీలో వాలంటీర్ దుర్గాప్రసాద్ హత్య కేసులో అంబేద్కర్ కోనసీమ జిల్లా పోలీసులు అరెస్టు చేసిన మాజీ మంత్రి పినిపే విశ్వరూప్ కుమారుడు శ్రీకాంత్‌కు న్యాయస్థానం నవంబర్ 4 వరకు రిమాండ్ విధించింది. రాజమండ్రి సెంట్రల్ జైలుకు శ్రీకాంత్‌ను పోలీసులు రాత్రి తరలించారు. 2022 జూన్ 6 న దుర్గాప్రసాద్ హత్య జరిగింది. ఈనెల 18న అనుమానితుడు వడ్డీ ధర్మేష్‌ను అరెస్టు చేసి విచారించిన క్రమంలో నలుగురు వ్యక్తులు హత్య చేశారని... శ్రీకాంత్ ప్రధాన నిందితుడిగా నిర్ధారణ అయినట్లు పోలీసులు తెలిపారు.‌ అరెస్టు చేస్తారన్న భయంతో శ్రీకాంత్ పారిపోగా తమిళనాడు మధురైలో అరెస్టు చేశారు. రాత్రి అమలాపురంలో న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. నవంబర్‌ 4 వరకు రిమాండ్‌ విధించారు.‌ 

Tags:    

Similar News