Hyderabad : నకిలీ సర్టిఫికెట్ల ముఠా గుట్టురట్టు.. ఆరుగురు నిందితుల అరెస్ట్

Update: 2025-05-17 06:45 GMT

హైదరాబాద్ నగరంలో నకిలీ సర్టిఫికెట్ల దందా గుట్టును ఎస్ఓటీ పోలీసులు రట్టు చేశారు. ఈ ముఠాలో ఆరు గునిరి అరెస్టు చేసిన పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. నిందితుల నుంచి 571 స్టాంప్ పేపర్లు, 48 ఫేక్ జనన పత్రాలు, 11 ఆదాయ సర్టిఫికెట్లు, కంప్యూటర్లు, నకిలీ స్టాంపులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు నగరంలో కొంత మంది భూ కబ్జాదారు లకు నకిలీ పత్రాలు సృష్టించి మోసాలకు పాల్పడుతు న్నారని పోలీసులు తెలిపారు.

పాత స్టాంప్ పేపర్లను సేకరించి వాటిపై ఉన్న అక్షరాలను కెమికల్స్ తో తుడిచేసి కొత్తగా మళ్లీ ముద్రిస్తున్నారన్నారు. ఈ కేసులో సరూర్ నగర్లో గత 9 ఏళ్లుగా సాత్విక్ ఎంటర్ ప్రైజస్ పేరుతో భానుప్రకాశ్, సాగ రిక దంపతులు నకిలీ పత్రాలు దందా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. వీరితో పాటు మరో నలుగురు ముఠా సభ్యులు నకిలీ పత్రాల తయారీకి రూ. 5 వేలు నుండి రూ. 20 వేల వరకు వసూలు చేస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది.

Tags:    

Similar News