Gangster : గ్యాంగ్ స్టర్ అత్యుత్సాహం.. జైలు నుంచి విడుదల.. వెంటనే మళ్లీ జైలు

Update: 2024-07-27 13:30 GMT

జైలు నుంచి విడుదలైన ఆనందంలో అనుచరుల అత్యుత్సా హం.. ఓ గ్యాంగ్ స్టర్ ను చిక్కుల్లో పడేసింది. జైలు నుంచి బయటకు వచ్చానన్న ఆనందం కొద్దిసేపు కూడా నిలవకుండానే మరోసారి జైలు పాలయ్యాడు. మహారాష్ట్ర నాసికు చెందిన హర్షద్ పాటంకర్ పేరు మోసిన గ్యాంగ్ స్టర్. ఈయన హత్యాయత్నం, దొంగతనాలు వంటి పలు కేసుల్లో గతంలో అరెస్టయ్యాడు.

మూడు రోజుల క్రితం అతడు జైలు నుంచి విడుదలయ్యాడు. విషయం తెలుసుకున్న అతడి అనుచరులు బేతేల్ నగర్ నుంచి అంబేద్కర్ చౌక్ వరకు కమ్ బ్యాక్ ర్యాలీ చేపట్టారు. ర్యాలీలో సన్రూఫ్ కారు లో వెళ్తూ తన మద్దతుదారులకు హర్షద్ అభివాదం చేస్తూ ముందుకు సాగిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. అది కాస్తా వైరల్ గా మారి పోలీసుల దృష్టికి చేరడంతో పోలీసులు హర్షన్ పై చర్యలు చేపట్టారు.

అనుమతి లేకుండా 15 కార్లతో భారీ ర్యాలీ చేపట్టి గందరగోళం సృష్టించాడంటూ హర్షద్ తోపాటు ఆరుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు వారందరినీ అరెస్ట్ చేసి జైలుకు పంపారు.

Tags:    

Similar News