Vijayawada: కామాంధుడి వికృత చేష్టలకు అమ్మాయి బలి.. అపార్ట్‌మెంట్‌పై నుంచి దూకి..
Vijayawada: విజయవాడలో దారుణం జరిగింది. ఓ కామాంధుడి వికృత చేష్టలకు ఓ బాలిక ఆత్మహత్య చేసుకుంది;
Vijayawada: విజయవాడలో దారుణం జరిగింది. ఓ కామాంధుడి వికృత చేష్టలకు ఓ బాలిక ఆత్మహత్య చేసుకుంది.ఈ ఘటన భవానిపురం కుమ్మరిపాలెం సెంటర్‌లో చోటు చేసుకుంది. గత కొన్ని రోజులుగా వినోద్ జైన్ అనే కామాంధుడు.. బాలికను వేధిస్తున్నాడు. ఈ వేధింపులు భరించలేక .. నిన్న సాయంత్రం అపార్ట్‌మెంట్‌పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఎంతో భవిష్యత్ ఉన్న బాలిక.. కామాంధుడి వేధింపులకు చనిపోవడం స్థానికంగా కలకలం రేపుతోంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడు వినోద్ జైన్‌ను అదుపులో తీసుకున్నారు