హర్యానాలోని గురుగ్రామ్లో షాకింగ్ చోరీ జరిగింది. ఢిల్లీ, జైపూర్ హైవేపై ఉన్న యాక్సిస్ బ్యాంక్ ఏటీఎం మెషిన్ ను పగులకొట్టకుండా, కీ వాడకుండా.. ఎటువంటి కార్డ్ ఉపయోగించకుండా సుమారు రూ. 10 లక్షల కుపైగా డబ్బును దోచుకెళ్లారు. ఏప్రిల్ 30న జరిగిన ఈఘటన.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దొంగలు ఏటీఎం బూత్ కు వెళ్లి ఫస్ట్ వీడియో రికార్డింగ్ వ్యవస్థను నిర్వీర్యం చేశారు. ఆ తర్వాత సెక్యూరిటీ సిస్టమ్ ను హ్యాక్ చేసి నగదు అపహరించారు. ఈ ఘటనపై గౌరవ్ కుమార్ బైస్లా అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే దొంగలు ఏటీఎం సాఫ్ట్ వేర్ ను ఎలా హ్యాక్ చేశారు? వారు ఎంతసేపులో ఈ దొంగతనం నిర్వహించారు? వంటి కోణాల్లో టెక్నికల్ ఎక్స్పర్ట్స్ సహాయంతో పోలీసులు విచారణ చేపడుతున్నారు. దాంతో పాటు ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీలు, ఇతర ఎలక్ట్రానిక్ ఆధారాలను పరిశీలిస్తున్నారు.