Suicide : అప్పుల బాధ తట్టుకోలేక ఉరి వేసుకున్న హెడ్ కానిస్టేబుల్

Update: 2024-05-31 10:21 GMT

అప్పుల బాధలు తాళలేక మనస్థాపానికి గురైన ఓ హెడ్ కానిస్టేబుల్ ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ విషాద సంఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రం లోని నరసింహ నగర్ సమీపంలో చోటు చేసుకుంది.

జిల్లా పోలీస్ కార్యాలయంలోని కంట్రోల్ రూమ్ లో హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తూ బత్తిని మనోహర్ (55) భార్య, ఇద్దరు కుమారులతో ఆనందంగా జీవనాన్ని సాగిస్తున్నారు. గత కొద్ది కాలంగా అప్పులతో ఆర్థికంగా చితకి పోవడంతో మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు.

మృతునికి భార్య, ఇద్దరు కుమారులు షాక్ లో ఉన్నారు. పెద్ద కుమారుడు మధుకర్ ఇటీవల పోలీస్ ఉద్యోగం పొంది ట్రైనింగ్ లో ఉన్నాడు. రెండవ కుమారుడు శ్రీకర్ ను ఆస్ట్రేలియాకు పంపేందుకు అప్పులు చేసి ఆర్థికంగా చితికి పోయాడు మనోహర్. బంధువుల రోదనలు ప్రాంతంలో మిన్నంటాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags:    

Similar News