Amberpet : భార్యాభర్తల లైవ్ న్యూడ్ వీడియో కాల్ దందా

Update: 2025-06-27 12:45 GMT

అంబర్ పేట అడ్డాగా లైవ్ న్యూడ్ వీడియో కాల్ దందాను టాస్క్ఫోర్స్ పోలీసులు గుట్టురట్టు చేశారు. గత నాలుగు నెలలుగా గుట్టుచప్పుడు కాకుండా భార్యాభర్తలు దందాను నడిపిస్తున్నారు. ఓ ఇంటికి కిరాయికి తీసుకొని ఏకంగా స్పెషల్ సెటప్ ను పెట్టారు. పక్కా ప్రణాళికతో నిర్వాహకుల్లా వ్యవహరిస్తూ, ఆన్ లైన్ లో తమ వీడియోలు అప్లోడ్ చేస్తూ.. డబ్బు తీసుకుని ప్రజలకు లింక్ పంపుతున్న ఈ వ్యవహారం టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడితో బట్టబయలైంది. ఈ దంపతులు గత నాలుగు నెలలుగా 'స్వీటీ తెలుగు కపుల్ 2027 అనే పేరుతో ఇన్స్టాగ్రామ్, ఇతర ఆన్ లైన్ ప్లాట్ ఫామ్ లలో తమ న్యూడ్ వీడియోలను ప్రచారం చేస్తున్నారు. ఇందుకు సంబంధించి లైవ్ లింక్ చూడాలంటే రూ.2000 వసూలు చేస్తున్నారు. అలాగే రికార్డ్ వీడియోల కోసం రూ.500 ఛార్జ్ చేస్తున్నట్టుగా అధికారులు తెలిపారు. ఇది ఇలా ఉండగా వీడియో షూట్ కోసం తమ నివాస భవనంపై ప్రత్యేకంగా కెమెరాలు, లైటింగ్, లైవ్ స్ట్రీమింగ్ పరికరాలతో కూడిన సెటప్ ఏర్పాటు చేశారు. టాస్క్ఫోర్స్ పోలీసుల దాడిలో కెమెరాలు, లైవ్ స్ట్రీమింగ్ పరికరాలు, లింక్ షేరింగ్ కోసం ఉపయోగిం చిన మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లు స్వాధీనం చేసుకున్నారు అధికారులు. దంపతులను అదుపులోకి తీసుకుని ఐటీ చట్టాల కింద కేసు నమోదు చేశారు. అనంతరం అంబర్పేట్ పో లీసులకు అప్పగించారు.

Tags:    

Similar News