Indo-Pak Match Bettings : ఇండో పాక్ మ్యాచ్.. జోరుగా బెట్టింగ్ జరిగిన ఏరియాలు ఇవే
భారత్-పాక్ క్రికెట్ మ్యాచ్‌తో బెట్టింగ్ రాయుళ్లు కోట్లు కొల్లగొట్టారు. దాయాదుల మధ్య జరిగిన క్రికెట్ మ్యాచ్ సందర్భంగా కోట్లలో పందాలు సాగాయి. బాల్ బాల్‌కు రెండు నుంచి రెండున్నర వేల వరకు పందెం వేసుకున్నట్లు తెలుస్తోంది. చందానగర్, మాదాపూర్, ఎల్బీనగర్, గోషామహల్, చిలకలగూడ, ముషీరాబాద్, పంజాగుట్ట తదితర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున సొమ్ము చేతులు మారినట్లు తెలుస్తోంది. మాదాపూర్‌లో ఓ స్థిరాస్తి వ్యాపారి వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి వీటిని నిర్వహించినట్లు తెలుస్తోంది. దీనిపై పోలీసులు భారీ నిఘా పెట్టారు.