TG : హనుమాన్ విగ్రహం దగ్ధం విచారణ చేపట్టిన డీఎస్పీ

Update: 2024-11-23 14:45 GMT

అంబటిపల్లి గ్రామంలో ఆలయంలోని హనుమాన్ విగ్రహం దగ్ధమవడం ఊరందరినీ ఉలిక్కిపడేలా చేసింది. విగ్రహం దగ్ధం కావడం ఊరికి అరిష్టమని ఊరంతా ఆందోళన చెందుతున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా అంబటిపల్లి గ్రామంలో హనుమాన్ విగ్రహం దగ్ధం ఊరంతా ఉలిక్కిపడేలా చేసింది. గర్భగుడిలోని విగ్రహం దగ్ధమవడం అంతు చిక్కని మిస్టరీగా మారింది. విగ్రహం దగ్ధం దృష్టశక్తుల పనా..? లేక ప్రమాద వశాత్తూ మంటలు చెలరేగాయా..? అనే అనుమానాలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. తమకు అండ అనుకున్న హనుమయ్య విగ్రహం దగ్ధం అవడం ఊరికి అరిష్టమని ఆ గ్రామస్తులంతా ఆందోళన చెందుతున్నారు. ఈ ఘటన మహాదేవపూర్ మండలం అంబటిపల్లి గ్రామంలో జరిగింది. గురువారం సాయంత్రం హనుమాన్ విగ్రహం వద్ద మంటలు చెలరేగాయి. హనుమాన్ విగ్రహం మొత్తానికి మంటలు వ్యాపించాయి. హనుమాన్ విగ్రహం అగ్నికి ఆహుతి అవుతుండడం గమనించిన స్థానికులు నీళ్లు పోసి మంటలు ఆర్పారు. కానీ మంటలు ఎలా చెలరేగాయి..? విగ్రహంపై ఎలా మంటలు వ్యాపించాయి? అనేది ఎవరికీ అంతుచిక్కడం లేదు. కాటారం డీఎస్పీ రామ్మోహన్ రెడ్డి ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. విచారణ జరిపిస్తామన్నారు.

Tags:    

Similar News