జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం పోసానిపేట గ్రామానికి చెందిన గుంట హనుమంతు(40) అనే వ్యక్తి సౌదీలో దారుణ హత్యకు గురయ్యాడు. హన్మంతు సౌదీలోని జుబెల్లో ఓ కంపెనీలో లేబర్ పనిచేస్తున్నాడు. కాగా శుక్రవారం అతనుండే గదిలో ఇద్దరు వ్యక్తుల మధ్య తలెత్తిన వివాదం హనుమంతు హత్యకు దారితీసినట్లు సమాచారం. నిందితుడు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. హనుమంతుకు భార్య, కొడుకు, కూతురు ఉన్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.