Krishna District: కృష్ణా జిల్లాలో బీజేపీ నాయకుడి హత్య.. వెంబడించి మరీ..
Krishna District: కృష్ణా జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గంలో బీజేపీ నాయకుడి హత్య కలకలం రేపింది.;
Krishna District: కృష్ణా జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గంలో బీజేపీ నాయకుడి హత్య కలకలం రేపింది.. వత్సవాయి మండలం చిట్యాల దగ్గర బీజేపీ నాయకుడు మల్లారెడ్డిని హత్య చేశారు దుండగులు.. వత్సవాయి వెళ్లి వస్తున్న ఆయన్ను వెంబడించిన దుండగులు కారుతో ఢీకొట్టించారు.. పొలాల్లో పారిపోతున్న వ్యక్తిని వెంటపడి నరికి చంపారు.. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు.. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు.. పాత కక్షలే కారణమని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.