Eluru Fire Accident : ఏలూరులో భారీ అగ్నిప్రమాదం... ఇద్దరు మృతి, మరో ఇద్దరి పరిస్థితి విషమం
Eluru Fire Accident : ఏలూరు జిల్లా మసునూరు మండలం అక్కిరెడ్డిగూడెంలో అర్థరాత్రి భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.;
Eluru Fire Accident : ఏలూరు జిల్లా మసునూరు మండలం అక్కిరెడ్డిగూడెంలో అర్థరాత్రి భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఫోరస్ కెమికల్ ఫ్యాక్టరీలోని యూనిట్-4లో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా... మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది... మూడు ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. బాయిలర్ పేలడంతో మంటలు ఎగసిపడుతున్నాయి. మరో రియాక్టర్ పేలుతుందేమోనని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ప్రమాద సమయంలో నైట్ డ్యూటీలో దాదాపు 150 మంది సిబ్బంది ఉన్నట్లు సమాచారం.