Nalgonda: వారం రోజుల క్రితం వివాహం.. అప్పుడే ముంచుకొచ్చిన మరణం..
Nalgonda: నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఈ యాక్సిడెంట్‌లో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు.;
Nalgonda: నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఈ యాక్సిడెంట్‌లో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. చింతలపల్లి మండలం మాల్ వద్ద ఆర్టీసీ బస్సు ఆటోను ఢీకొట్టింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న శ్రీను నాయక్, అతని తండ్రి మోతేరాంలు అక్కడే ప్రాణాలు కోల్పోయారు.
మృతులు రంగారెడ్డిజిల్లా మాడుగుల మండలం మాన్య నాయక్ తండ వాసులుగా గుర్తించారు. శ్రీను నాయక్ వికారాబాద్ వన్ టౌన్ ప్రొబేషనరీ ఎస్‌ఐగా విధులు నిర్వహిస్తున్నాడు. ఇతనికి వారం రోజుల క్రితమే వివాహమైంది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.