OpenAI : ఓపెన్‌ ఏఐ ఎక్స్‌ ఖాతా హ్యాక్‌

Update: 2024-09-25 10:30 GMT

‘చాట్‌ జీపీటీ’ సృష్టికర్త ఓపెన్‌ ఏఐ సంస్థ ఇప్పుడు హ్యాకర్లతో ఇబ్బంది పడుతోంది. తాజాగా ఆ సంస్థకు చెందిన ఒక ఎక్స్‌ ఖాతా హ్యాక్‌కు గురైంది. అందులో హ్యాకర్లు క్రిప్టో కరెన్సీ ప్రకటన పోస్టు చేశారు. ఆ క్రిప్టో టోకెన్లు ఓపెన్‌ ఏఐకి చెందినవిగా పేర్కొన్నారు. ఎక్స్‌ ఖాతా హ్యాక్‌ గురించి సంస్థ అధికారికంగా ప్రకటించింది. @OpenAINewsroom అనే ఖాతా సోమవారం ఉదయం హ్యాక్‌కు గురైనట్లు తమ సంస్థ గమనించిందని తెలిపింది. ఆ ఖాతా నుంచి సాయంత్రం 7 గంటల సమయంలో ఈ పోస్టులు వచ్చినట్లు వెల్లడించింది. ఇవి న్యూయార్క్‌ సహా కొన్నిచోట్ల కనిపిస్తున్నట్లు పేర్కొంది. దీనిపై దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించింది. కాగా, సంస్థలో కీలక ఉద్యోగి అయిన జేసన్‌ వీ ఎక్స్‌ ఖాతా కూడా ఆదివారం హ్యాక్‌కు గురైంది. ఆ ఖాతాను హ్యాక్‌ చేసిన హ్యాకర్లు క్రిప్టో పోస్టులు పెట్టారు. అంతేకాదు, ఈ ఏడాది జూన్‌లో ఓపెన్‌ ఏఐ చీఫ్ సైంటిస్ట్ జాకబ్ పచోకీ ఖాతా కూడా హ్యాక్ అయ్యింది. గత ఏడాది జూన్‌లో కంపెనీ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ మారియా మురాటీస్ ఖాతా తాత్కాలికంగా గుర్తుతెలియని వ్యక్తులు ఉపయోగించారు..

Tags:    

Similar News