బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ కేసులో విష్ణుప్రియను కీలక నిందితురాలిగా పోలీసులు గుర్తించారు. 15 బెట్టింగ్ యాప్స్ సంస్థలతో నిందితులకు లింకులు ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. విష్ణుప్రియ సూచనలమేరకే రీతూ చౌదరి బెట్టింగ్ యాప్స్ ను ప్రమోషన్ చేసినట్లు వెలుగుచూసింది. బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసే విధంగా విష్ణుప్రియ సోషల్ మీడియాలో విపరీతంగా పోస్టింగ్లు పెట్టడం, ఆ యాప్ డబ్బులు పెట్టి సంపాదిం చవచ్చని డైరెక్ట్ గా చాలా మందిని బెట్టింగ్ వైపుకు మళ్లించే విధంగా విష్ణుప్రియ పోస్టింగ్లు పెట్టారని పోలీసులు చెబుతున్నారు. ఈ కేసులో నిందితురాలుగా ఉన్న విష్ణుప్రియ మొబైల్ ను కూడా పోలీసులు సీజ్ చేశారు. కాగా బెట్టింగ్ యాప్స్ కేసులో నిందితులు రోజువారి విచారణలో భాగంగా ముగ్గురు ముగ్గురు చొప్పున విచారణకు రావాలని ఆదేశించినప్పటికీ కేవలం ఇద్దరు మాత్రమే విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో ఇదివరకే టేస్టీ తేజ విచారణకు హాజరయ్యారు. సోషల్ మీడియాలో బెట్టింగ్ యాప్ లపై పోస్టులు పెట్టిన కానిస్టేబుల్ కిరణ్ గౌడ్ వ్యక్తిగతంగా విచారణకు కావడంతో అతన్ని మూడు గంటల పాటు విచారించి స్టేట్మెంట్ ను రికార్డు చేశారు.