Pranay Murder Case : ఒకరికి ఉరిశిక్ష, మిగిలిన వారికి జీవిత ఖైదు ప్రణయ్ హత్య కేసు

Update: 2025-03-10 11:15 GMT

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన ప్రణయ్ హత్య కేసు నిందితులకు కోర్టు శిక్ష విధించింది. ఏ2గా ఉన్న సుభాష్‌కు ఉరిశిక్ష, మిగిలిన ఆరుగురు నిందితులకు జీవిత ఖైదు విధిస్తూ నల్గొండ ఎస్సీ, ఎస్టీ కోర్టు తీర్పు వెల్లడించింది. ఈ కేసులో ఏ1గా ఉన్న అమృత తండ్రి మారుతీ రావు 2020లో ఆత్మహత్య చేసుకున్నారు. 2018లో మిర్యాలగూడలో అమృతతో కలిసి వెళ్తోన్న ప్రణయ్‌ను సుభాష్ శర్మ కత్తితో నరికి చంపాడు.

A1 మారుతీరావు (అమృత తండ్రి), A2 సుభాష్ శర్మ(బిహార్), A3 అస్గర్ అలీ, A4 అబ్దుల్ భారీ, A5 అబ్దుల్ కరీం, A6 శ్రావణ్ (మారుతీరావు తమ్ముడు), A7 శివ (మారుతీరావు కారు డ్రైవర్), A8 నిజాం (ఆటో డ్రైవర్). కరీం సాయంతో అస్గర్‌కు సుపారీ ఇచ్చిన మారుతీరావు 2018 సెప్టెంబర్ 14న మిర్యాలగూడలో ప్రణయ్‌ను హత్య చేయించాడు.

Tags:    

Similar News