Punjab Government : మాదకద్రవ్యాల మాఫియాపై పంజాబ్ సర్కార్ బుల్డోజర్

Update: 2025-02-26 14:30 GMT

మాదకద్రవ్యాల మాఫియాపై ఉక్కుపాదం మోపేందుకు పంజాబ్లోని ఆప్ ప్రభుత్వం సిద్ధమైంది. ఇందుకోసం నిందితులపై బుల్డోజర్ ను ప్రయోగిస్తోంది. అక్రమార్కుల ఇళ్లను కూల్చి వేయడంతోపాటు, వారి ఆస్తుల్ని, వాహనాలనూ సీజ్ చేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలో తాల్వాండీ గ్రామానికి చెందిన సోనూ అనే నిందితుడి ఇంటిని అధికారులు కూల్చేశారు. అలాగే లుథియానాకు చెందిన రాహుల్ హన్స్ పైనా ఇలాంటి చర్యలే చేపట్టింది. డ్రగ్స్ స్మగ్లింగ్ కేసులో ఇటీవలే అరెస్టయిన అతడి విలాసవంతమైన భవంతిని అధికారులు నేలమట్టం చేశారు. కూల్చివేతలను పోలీసు అధికారులు సమర్థించుకున్నారు. మాదకద్రవ్యాల విక్రయం ద్వారా సంపాదించిన సొమ్ముతోనే ఈ ఇళ్లు నిర్మించినట్లు చెప్పారు. వారి వాహనాలనూ సీజ్ చేస్తున్నామని చెప్పారు. కేవలం లుథియానా కమిషనరేట్ పరిధిలోనే దాదాపు 78 మంది డ్రగ్ పెడ్లర్లను గుర్తించామని, వారందరిపైనా బుల్డోజర్ ప్రయోగిస్తామని హెచ్చరించారు. పంజాబ్ ను మాదకద్రవ్య రహిత రాష్ట్రంగా మార్చాలనే సంకల్పంలో భాగంగా, అక్కడి ఆప్ ప్రభుత్వం ఇటీవల కఠిన చర్యలకు సిద్ధమైంది.

Tags:    

Similar News