ప్రముఖ గజల్-ప్లేబ్యాక్ సింగర్, పద్మశ్రీ గ్రహీత పంకజ్ ఉదాస్ ఫిబ్రవరి 26, 2024న 72ఏళ్ల వయసులో సుదీర్ఘ అనారోగ్యంతో మరణించారు. ఈరోజు ఉదయం 11 గంటలకు ముంబైలో ఆయన తుది శ్వాస విడిచారు. ఆయన కొంతకాలంగా ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన కుటుంబం అభిమానులకు ఈ వార్తను తెలియజేసింది.
ఈ సందర్భంగా రిలీజ్ చేసిన అధికారిక నోట్‌లో, గాయకుడు దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్నారని కుటుంబం తెలిపింది. ప్రముఖ గజల్ గాయని కుమార్తె నయాబ్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ప్రకటనను పంచుకున్నారు. "దీర్ఘకాలిక అనారోగ్యం కారణంగా 2024 ఫిబ్రవరి 26న పద్మశ్రీ పంకజ్ ఉదాస్ మరణించారని చాలా భారమైన హృదయంతో మీకు తెలియజేసేందుకు మేము చాలా బాధపడుతున్నాము" అని తెలిపారు.
పంకజ్ భౌతికకాయం ఇప్పటికీ బ్రీచ్ క్యాండీ హాస్పిటల్‌లోనే ఉంది. రేపు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఇకపోతే, దివంగత గాయకుడికి అతని ఇద్దరు కుమార్తెలు నయాబ్, రేవా ఉదాస్ ఉన్నారు.
ప్రధాని నివాళి
'పంకజ్ ఉదాస్ జీని కోల్పోయినందుకు మేము సంతాపం తెలియజేస్తున్నాం. అతని గానం అనేక భావోద్వేగాలను అందించింది. అవి వారి గజల్స్ ఆత్మతో నేరుగా మాట్లాడాయి. అతను భారతీయ సంగీతంలో ఒక వెలుగు వెలిగాడు, అతని గొంతు తరతరాలకు గుర్తుండి పోతుంది. సంవత్సరాలుగా నేను అతనితో అనుబంధం కలిగి ఉన్నాను. ఆయన నిష్క్రమణ సంగీత ప్రపంచంలో ఎప్పటికీ పూరించలేని శూన్యాన్ని మిగిల్చింది. ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు సానుభూతి తెలియజేస్తున్నాను. ఓం శాంతి' అని మోదీ సోషల్ మీడియాలో రాసుకొచ్చారు.