Nizamabad: రెయిలింగ్‌ను ఢీకొన్న కారు.. ఇద్దరు చిన్నారులతో సహా నలుగురు అక్కడికక్కడే మృతి..
Nizamabad: నిజామాబాద్ జిల్లా ముప్కాల్ దగ్గర నేషనల్ హైవే నంబర్ 44పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.;
Nizamabad: నిజామాబాద్ జిల్లా ముప్కాల్ దగ్గర నేషనల్ హైవే నంబర్ 44పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టైరు పేలడంతో అదుపుతప్పిన కారు...రెయిలింగ్‌ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారులోని నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నారు. మృతులు హైదరాబాద్ టోలిచౌకికి చెందిన వారుగా గుర్తించారు పోలీసులు. హైదరాబాద్ నుంచి నిర్మల్ వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో కారులో ఏడుగురు ప్రయాణికులున్నారు.