Kakinada: కాకినాడలో రౌడీ షీటర్ హత్య.. కత్తులతో అతిక్రూరంగా..
Kakinada: కాకినాడలో రౌడీ షీటర్‌ను హత్య చేశారు ప్రత్యర్ధులు. అంబేద్కర్ భవన్‌లో దంగేటి జగదీష్‌ను అక్కడికక్కడే చంపేశారు.;
Kakinada: కాకినాడలో రౌడీ షీటర్‌ను హత్య చేశారు ప్రత్యర్ధులు. అంబేద్కర్ భవన్‌లో ఉన్న దంగేటి జగదీష్‌ను అక్కడికక్కడే చంపేశారు. హత్యకు గురైన జగదీష్‌పై గతంలో పలు క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఇంద్రపాలెం వద్ద జరిగిన వీరేంద్ర అనే యువకుడు హత్య కేసులో నిందితుడు కూడా. జామ పండ్ల వ్యాపారం ముసుగులో యువకులకు గంజాయి అమ్మేవాడని స్థానికులు ఆరోపిస్తున్నారు.
తన వద్ద గంజాయి కొన్న యువకులను బెదిరించి మరీ.. వారికి గంజాయి అమ్మేవాడని చెబుతున్నారు. గంజాయి లావాదేవీల కారణంగానే సుమారు 10 మంది వ్యక్తులు అతిక్రూరంగా కత్తితో దాడి చేశారని సాక్షులు చెబుతున్నారు. కొనఊపిరితో ఉన్న జగదీష్‌ని జీజీహెచ్‌కు తరలించగా చికిత్స పొందుతూ చనిపోయాడు. గంజాయి వ్యాపారం లావాదేవీలు, పాతకక్షలే హత్యకు కారణం అయి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.