Medaram : గుండెపోటుతో సమ్మక్క పూజారి మృతి

Update: 2024-02-28 06:15 GMT

Medaram : మేడారంలోని వనదేవత సమ్మక్క పూజారి (Sammakka Pujari) సిద్దబోయిన దశరథం గుండెపోటుతో మృతిచెందాడు. కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకా రం.. సమ్మక్క పూజారి దశరథం కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. మంగళవారం ఉదయం గుండెనొప్పి రావడంతో హనుమకొండకు చెందిన ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఈ క్ర మంలో దశరథం మృతిచెం దాడని వైద్యులు నిర్థారించారు. దశరథం మృతితో గ్రామ ప్రజలు, బంధుమిత్రులు సంతాపాన్ని తెలిపారు. సమ్మ క్క పూజారి మృతికి రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణ అభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ప్రగాఢ సానుభూతి తెలిపారు. పలువు రు పూజారులు, ఆదివాసీ సంఘాల నాయకులు సంతాపం తెలిపారు. ఆసియా ఖండంలోనే అతిపెద్ద జాతరైన మేడారం సమ్మక్క సారలమ్మల పూజారి సిద్దబోయిన లక్ష్మణరావు గతేడాది అనారోగ్యంతో ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు ఆయన తమ్ముడైన సిద్ధబోయిన దశరథం అనారోగ్యంతో మృతి చెందడంతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో ఉన్నారు. మేడారం జాతర ప్రధాన పూజారిగా సిద్దబోయిన లక్ష్మణ్‌రావు కుమారుడైన సిద్దబోయిన నితిన్‌‌ను దేవాదాయ శాఖ ఇటీవలే నియమించింది. మేడారం జాతరలో ప్రధాన పూజారితోపాటు మరో 12 మంది గిరిజన పూజారులు పూజలు నిర్వర్తిస్తారు.

Tags:    

Similar News