Swimming : ఈత సరదా ఇద్దరి ప్రాణం తీసింది

Update: 2024-05-27 09:14 GMT

ఎండ వేడిని తీర్చుకునేందుకు సరదాగా ఈత కోసం వెళ్లిన ఇద్దరు అక్కడే ప్రాణాలు వదిలారు. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లా కేంద్రం మంజీరా నదిలో ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది.

సంగారెడ్డి మండలం ఇస్మాయిల్ ఖాన్ పేట గ్రామానికి చెందిన మహమ్మద్ అష్రఫ్ (16), అలాగే సంగారెడ్డి పట్టణానికి చెందిన మహమ్మద్ అఫ్రోజ్ (16) ఇద్దరు స్థానికంగా వెల్డింగ్ పని చేసుకుంటూ ఉన్నారు. ఆదివారం మంజీరా డ్యాంలో ఈత కోసం అని ఇద్దరూ వెళ్లారు. ఈత కొడుతుండగా ప్రమాదవ శాత్తు ఇద్దరు నీట మునిగి మృతి చెందారు.

కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని రూరల్ ఎస్సై వినయ్ కుమార్ తెలిపారు. చేతికి వస్తున్న కొడుకులు మృతి చెందడం పట్ల వారి కుటుంబాల్లో విషాదం అలుముకుంది.

Tags:    

Similar News