ఏపీలో సోషల్ మీడియా వార్ జరుగుతోంది. వైసీపీ హయాంలో టీడీపీ నేతల మీద అనుచిత వ్యాఖ్యలు చేసినవారిపై టీడీపీ ప్రభుత్వం ఇప్పుడు కేసులు పెడుతోంది. ఐతే..అనూహ్య పరిణామం ఒకటి చోటుచేసుకుంది. తెలుగు దేశం పార్టీకి సంబంధించిన అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ హ్యాక్ అయినట్టు వార్తలొచ్చాయి. టీడీపీ యూట్యూబ్ ఛానెల్ లో బుధవారం, డిసెంబర్ 18 ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎటువంటి అప్ లోడ్స్ కాలేదు. ఛానెల్ స్ట్రైక్ కు గురైనట్టు (This page isn't available. Sorry about that. Try searching for something else.) చూపిస్తోంది. హ్యాకర్లను గుర్తించేందుకు టీడీపీ టెక్నికల్ వింగ్ రంగంలోకి దిగినట్టు సమాచారం. దీనిపై ఇప్పటికే యూట్యూబ్ కు అఫీషియల్ గా కంప్లయింట్ చేసింది టీడీపీ.