Actress Rukmini Vijay Kumar : సీతారామం నటి కారులో చోరీ

Update: 2025-05-17 11:00 GMT

సీతారామం మూవీ నటి రుక్మిణి విజయ్ కుమార్ కారులో భారీ చోరీ జరిగింది. వజ్రపు ఉంగరాలు సహా దాదాపు రూ.23 లక్షల విలువైన వస్తువులు అపహరించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, ప్రధాన నిందితుడు టాక్సీ డ్రైవర్ మొహమ్మద్ మస్తాన్ని అదుపులోకి తీసుకున్నారు. రుక్మిణి ఈనెల 11న మార్నింగ్ వాకింగ్ కోసం బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వద్దకు వెళ్లింది. అక్కడ 18వ గేట్ దగ్గర తన కారుని పార్క్ చేసి లోనికి వెళ్లింది. అప్పుడు కారులో ఖరీదైన హ్యాండ్ బ్యాగ్, పర్స్, రెండు వజ్రపు ఉంగరాలు, రోలెక్స్ వాచ్ లాంటి విలువైన వస్తువులు ఉన్నాయి. అయితే రుక్మిణి కారు పార్క్ చేశాక లాక్ వేయడం మర్చిపోయింది. ఇక దీనిని అడ్వాండేజ్ గా తీసుకున్న టాక్సీ డ్రైవర్ మస్తాన్ కారులోని వస్తువులను దొంగిలించాడు. దాంతో నటి కప్పన్ పార్క్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. సీసీటీవీ ఫుటేజ్, ఇతర ఆధారాలతో ప్రధాన నిందితుడిని అరెస్ట్ చేశారు. దాదాపు రూ.23 లక్షల విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.

Tags:    

Similar News