Rajasthan : రంగులు చల్లడం వద్దన్నందుకు చంపేశారు

Update: 2025-03-14 06:15 GMT

రంగులు చల్లడం వద్దని వారించినందుకు రాజస్థాన్‌లో ఓ యువకుడిని ముగ్గురు వ్యక్తులు దారుణంగా కొట్టిచంపారు. హన్సరాజ్(25) స్థానిక లైబ్రరీలో పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నాడు. అదే సమయంలో అక్కడికి వచ్చిన ముగ్గురు వ్యక్తులు హోలీ పేరుతో అతనిపై రంగులు చల్లేందుకు ప్రయత్నించగా హన్స్‌రాజ్ వద్దని వారించాడు. దీంతో అతడిపై దాడి చేయగా మరణించాడు. కుటుంబసభ్యులు ఆందోళనకు దిగగా పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు.

ఈ అమానుష ఘటనపై హన్స్ రాజ్ కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్థులు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. హన్స్ రాజ్ భౌతిక కాయాన్ని తీసుకుని నేషనల్ హైవేను బ్లాక్ చేశారు. అయితే మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత వారు ఆందోళన విరమించారు. హన్స్ రాజ్ కుటుంబానికి రూ. 50 లక్షల తక్షణ పరిహారం ఇవ్వాలని, ఆ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. అయితే పోలీసుల నుంచి స్పష్టమైన హామీ వచ్చిన తర్వాత ఆ డెడ్ బాడీని నేషనల్ తొలగించి, ఆందోళన విరమించారు రాల్సాస్ గ్రామస్థులు. 

Tags:    

Similar News