వికారాబాద్ జిల్లా గెరిగేంట్ పల్లిలో ఓ వ్యక్తి పై కల్లు వ్యాపారి దాడి చేశాడు. ఈ ఘటనలో బాధితుడి తలపై తీవ్ర గాయాలయ్యాయి. కల్లు ధర అమాంతం ఐదు రూపాయలు ఎలా పెంచుతారని అడగడమే పాపమైంది. వ్యాపారి కోపం తట్టుకోలేకపోయాడు.
రేటు పెంచారని అడిగినందుకే దాడికి పాల్పడ్డారని బాధితుడు శ్రీనివాస్ ఆరోపిస్తున్నాడు. వికారాబాద్ మండలం గెరిగేంట్ పల్లిలో పది రూపాయలు ఉన్న కల్లు సీసా ధరను రూ.15కు పెంచి అమ్ముతున్నాడు వ్యాపారి దత్తాత్రేయ గౌడ్. కల్లు సేవించిన తర్వాత ధరపై శ్రీనివాస్ ప్రశ్నించాడు. అది ముందు అడగాలని వ్యాపారి అన్నాడు. కల్లు వ్యాపారి దత్తాత్రేయ గౌడ్, శ్రీనివాస్ కు దీంతో వాగ్వాదం పెరిగింది.
దత్తాత్రేయ గౌడ్ అనుచరులతో కలిసి శ్రీనివాస్ పై దాడి చేశాడు. బాధితుడు వికారాబాద్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో.. కేసు నమోదు చేశారు.