Nandyala: ప్రేమ పేరుతో వాలంటీర్ మోసం.. యువతికి రెండుసార్లు అబార్షన్..
Nandyala: నంద్యాల జిల్లా చాగలమర్రి మండలం మద్దూరు గ్రామంలో వాలంటీర్ నిర్వాకం వెలుగులోకి వచ్చింది.;
Nandyala: నంద్యాల జిల్లా చాగలమర్రి మండలం మద్దూరు గ్రామంలో వాలంటీర్ నిర్వాకం వెలుగులోకి వచ్చింది. ప్రేమ పేరుతో వాలంటీర్ కిరణ్ మోసం చేశాడని.. తనకు న్యాయం చేయాలని మాణిక్యమ్మ అనే యువతి వేడుకుంటుంది. రెండుసార్లు అబార్షన్ చేయించాడని ఆవేదన వ్యక్తం చేసింది. మరో పెళ్లికి కిరణ్ సిద్ధమయ్యాడని.. తనకు న్యాయం జరగకపోతే ఆత్మహత్యే శరణ్యమని తెలిపింది. పోలీసులు కూడా పట్టించుకోవడం లేదని వాపోయింది.