Lift Wire : లిఫ్ట్​ వైర్​ తెగి పడి కార్మికుడు మృతి

Update: 2024-07-04 04:47 GMT

మెటీరియల్​ లిఫ్ట్​వైర్ ​తెగి పడి ఓ కార్మికుడు మృతిచెందాడు. బాచుపల్లి పోలీసులు, స్థానికులు తెలిపిన ప్రకారం.. బాచుపల్లి కౌలస్య కాలనీలో డాల్ఫిన్​కన్​స్ట్రక్షన్​అపార్ట్​మెంట్​ నిర్మిస్తోంది. మెదక్​జిల్లాకు చెందిన రాములు(56) కార్మికుడిగా పని చేస్తున్నాడు. బుధవారం క్రేన్​తో మెటిరియల్​లిఫ్ట్​ చేస్తుండగా క్రేన్​వైరు తెగి కార్మికుడిపై పడింది. దీంతో రాములు స్పాట్ లో మృతి చెందాడు. క్రేన్​పై కరెంట్ తీగలు పడడంతో సరఫరాలో అంతరాయం ఏర్పడగా.. అనంతరం విద్యుత్ అధికారులు పునరుద్ధరించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. డాల్ఫిన్​ కన్​స్ట్రక్షన్​ నిర్వాహకులు తగు రక్షణ చర్యలు పాటించకపోవడంతోనే కార్మికుడు మృతిచెందాడని నిజాంపేట్​ బీజేపీ అధ్యక్షుడు ఆకుల సతీశ్​ఆరోపించారు. మృతిచెందిన కార్మికుడి కుటుంబానికి ఆర్థిక సాయం అందించాలని,​బాధ్యులను గుర్తించి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్​ చేశారు.

Tags:    

Similar News