Attack with Blade : బ్లేడ్ తో యువతిపై ప్రేమోన్మాది దాడి

Update: 2024-08-05 11:15 GMT

ప్రేమపేరుతో యువతులపై పైశాచిక దాడులు జరుగుతున్నాయి. గతంలో పల్నాడు జిల్లాలో ఈ తరహా సంఘటన చోటుచేసుకోగా తాజాగా గుంటూరు జిల్లా తాడేపల్లి ఎయిమ్స్ కు వెళ్లే రహదారి సమీపంలో ఆదివారం ప్రేమోన్మాది యువతి పైదాడికి పాల్పడ్డాడు.

జాతీయ రహదారి ఎయిమ్స్ రోడ్డు వద్ద ప్రేమోన్మాది యువతిని బ్లేడ్ తో గొంతు కోసేందుకు ప్రయత్నించాడని తాడేపల్లి పోలీసులు తెలిపారు. గొంతుపై గాయాలు కాగా యువతి అప్రమత్తం కావటంతో ప్రాణాపాయం నుండి బయటపడింది. ఘటనా స్థలంలో ఉన్న స్థానికులు అడ్డుపడి నిందితులను పట్టుకుని తాడేపల్లి పోలీసులకు అప్పగించారు. బాధితురాలని మణిపాల్ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు.

అవనిగడ్డకు చెందిన బాధితురాలు ఓ ప్రైవేట్ వైద్యశాలలో నర్సుగా పనిచేస్తున్నట్లు సమాచారం. అయితే గత కొంతకాలంగా విజయవాడకు చెందిన క్రాంతి ప్రేమిస్తున్నానని చెప్పి ఆమె వెంట పడుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఆమె అతని ప్రేమను తిరస్కరించడంతో బ్లేడుతో చంపటానికి ప్రయత్నించాడు. స్థానికులు అప్రమత్తం కావడంతో యువతి ప్రాణాలతో బయటపడింది. కేసు నమోదు చేసుకుని తాడేపల్లి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Tags:    

Similar News