Hyderabad : యూట్యూబర్ అరెస్ట్ .. ఓఆర్ఆర్ పై డబ్బులు విసిరేసి న్యూసెన్స్
మేడ్చల్ జిల్లా ఘట్ కేసర్ పీఎస్ పరిధి అవుటర్ రింగురోడ్డుపై మనీ హంట్ ఛాలెంజ్ పేరుతో డబ్బులు వెదజల్లుతూ న్యూసెన్స్ క్రియేట్ చేసిన భానుచందర్ అనే యూట్యూబర్ ను ఘట్ కేసర్ పోలీసులు అరెస్టు చేశారు. ఘట్ కేసర్ పీఎస్ లో మల్కాజిగిరి ఏసిపి చక్రపాణి పత్రికా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఏసిపి మాట్లాడుతూ హైదరాబాద్ బాలానగర్ కు చెందిన రాయలాపురం భానుచందర్(29) అనే వ్యక్తి ఘట్ కేసర్ వద్ద అవుటర్ రింగురోడ్డు పై తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా వీడియో తీస్తూ కరెన్సీని అవుటర్ రింగురోడ్డు పై చెట్లపొదల్లో విసిరివేసి వచ్చి ఎవరైనా తీసుకోమని మనీ హంట్ ఛాలెంజ్ చేస్తున్నాడని అన్నారు.ఇది తన ఇన్స్ట్రా గ్రాం సోషల్ మీడియా ద్వారా వైరల్ చేశాడు.దీంతో ఓఆర్ఆర్ సిబ్బంది ఫిర్యాదు మేరకు బిఎన్ఎస్ సెక్షన్ 179 నేషనల్ యాక్ట్ - 1956 ప్రకారం ప్రకారం భానుచందర్ ను అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. సమాజానికి ఉపయోగపడే మెసేజ్ లు పెట్టాలని,ఇలాంటి వీడియోలు చేసినట్లయితే కేసులు తప్పవని హెచ్చరించారు.