యాదగిరిగుట్ట దేవస్థానానికి అనుబంధ ఆలయమైన పూర్వగిరి ప్రాతగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో వార్షిక బ్రహ్మోత్సవాలు శుక్రవారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉదయం స్వస్తివాచనం, ధ్వజారోహణం, రక్షాబంధ నం, విష్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనాన్ని అర్చకులు నిర్వహించారు. దాదాపుగా రెండు గంటల పాటు జరిగిన ప్రత్యేక పూజలతో ఉత్స వాల సందడి షురూ అయింది. ఆలయ చైర్మన్ నరసింహమూర్తి, ఈవో భాస్కర్ రావు పూజల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ నెల 7న మొదలైన బ్రహ్మోత్సవాలు 13 వరకు వారం రోజుల పాటు వైభవంగా సాగనున్నా యి. ఇక ఈ నెల 13న నిర్వహించే అష్టోత్తర శతఘటాభిషేకంతో బ్రహ్మోత్సవాలు పరి సమాప్తి కానున్నాయి. ఇక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ముఖ్య ఘట్టాలు 9న స్వామివారి ఎదుర్కోలు మహోత్సవం, 10న తిరుకల్యాణ మహోత్సవం, 11న దివ్యవిమాన రథోత్సవం జరగనున్నాయి.