TTD : తిరుమలలో వారికి ఫ్రీ దర్శనం

Update: 2024-06-01 05:18 GMT

తిరుమలలో దివ్యాంగులు, వృద్ధుల కోసం ప్రతిరోజూ(సోమవారం నుండి శనివారం) మ.3 గంటలకు టీటీడీ ప్రత్యేక స్లాట్‌ను ఏర్పాటు చేయనుంది. ఈ సమయంలో ఇతర క్యూలు నిలిపివేసి, వీరికి నేరుగా ఉచిత దర్శనం కల్పిస్తారు. దీనికోసం టీటీడీ వెబ్‌సైట్‌లో టికెట్ బుక్(FREE) చేసుకోవాల్సి ఉంటుంది. 65+వయసున్న వారు, హార్ట్ సర్జరీ, కిడ్నీ ఫెయిల్యూర్, క్యాన్సర్, పక్షవాతం, ఆస్తమా ఉన్నవారికి ఇది వర్తిస్తుంది. వారు ఆధార్, మెడికల్ సర్టిఫికెట్ చూపించాలి.

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది.. గతవారంతో పోలిస్తే పరిస్థితి కాస్త మారింది. గత వీకెండ్‌లో రద్దీ భారీగా కనిపించగా.. ఈసారి కొంత తగ్గిందనే చెప్పాలి. భక్తులందరికి దాదాపు 18 గంటల్లో శ్రీవారి దర్శనం లభించనుందని టీటీడీ తెలియజేసింది.

నేటి నుంచి 5వ తేదీ వరకు హనుమాన్ జయంతిని ఘనంగా నిర్వహించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేసింది. అంజనాద్రి ఆకాశ గంగ ఆలయం, జపాలి తీర్థంలో జయంతిని నిర్వహిస్తున్నారు. ఆకాశ గంగలో శ్రీ బాలాంజనేయ స్వామి, శ్రీ అంజనాదేవికి ఐదు రోజులు పాటు ప్రత్యేక అభిషేకం నిర్వహించనున్నారు. అలాగే జపాలి తీర్థంలో సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది టీటీడీ.

Tags:    

Similar News